కరీంనగర్ టౌన్, జనవరి 04(పిసిడబ్ల్యూ న్యూస్): వార్డు ఆఫీసర్లుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇటీవల వార్డు ఆఫీసర్లుగా నియామకమై శిక్షణ పూర్తిచేసిన అధికారులతో శనివారం రోజు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సమావేశాన్ని నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న నూతన ఉద్యోగులకు 60 వార్డులో విధి నిర్వాహణ బాధ్యతలు అప్పగించారు. విధి విధానాలు, చేపట్టాల్సిన బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు.