Saturday, April 5, 2025

పశుగ్రాసం (గడ్డివాము) దగ్ధం. – రైతుకు 60,000 ఆర్థిక నష్టం

జనవరి 3(పి సి డబ్ల్యూ ప్రతినిధి): బయ్యారం మండల కేంద్రంలోని రైతు ఇంటి సమీపంలో పశువుల మేత కోసం సుమారుగా 6 ఎకరాల గడ్డివామును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు లైటర్ తో తగలబెట్టినట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తమ పశువులకు ఆరు ఎకరాల గడ్డిని కొనుగోలు చేసి వారి ఇంటి సమీపంలో గడ్డివాముగా పెట్టుకున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది లైటర్ సహాయంతో గడ్డిని దగ్ధం చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు.గడ్డి తగలబెట్టిన సమీపంలో లైటర్ ఉండటం విశేషం.అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ స్టేషన్ కి స్థానికులు సమాచార అందివ్వడంతో, మహబూబాబాద్ నుండి ఫైర్ సిబ్బంది తమ వాహనంతో అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి గురువారం రాత్రి సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని శుక్రవారం రాత్రి నుండి ఉదయం వరకు శక్తి వంచన లేకుండా శ్రమించి మంటలను అదుపులో కి తీసుకోవచ్చి తమ వంతు ప్రయత్నం కొనసాగించినట్లు తెలిపారు. దీనితో రైతుకు 60 వేల నుంచి 80 వేల ఆర్థిక నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తెలిపారు. పశువుల మేతకు సమీకరించిన గడ్డి వాము దగ్ధం చేయడంపై పలువురు స్థానికులు మండి పడ్డారు. ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన వారిని గుర్తించి చట్ట పరంగా శిక్షించాలని కోరారు. మహబూబాబాద్ అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles