వరంగల్ జిల్లా //డిసెంబర్ 19 (పి సి డబ్ల్యూ న్యూస్)
బలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య స్వర్గస్తులయ్యారు. నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన ఆయన గత కొద్ది రోజుల నుంచి కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు.కొన్నాళ్లుగా ఇంటి వద్ద వైద్య చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మృతి చెందాడు. కాగా, జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం బలగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ పాట అందరినీ ఏడిపించిన విషయం తెలిసిందే. బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు పాడిన ఈ పాట తెలంగాణ ప్రజలను కన్నీళ్లు పెట్టించింది.తెలంగాణ సినిమా “బలగం” లో చివరి ఎమోషనల్ పాట పాడి అందరిని ఆకట్టుకున్న నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారులు పస్తం మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతూ డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతు ఇప్పటివరకు ఆయన బ్రతికారు.ఇటీవల మొగిలయ్య కుటుంబానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రూ. లక్ష ఆర్థికసాయం చేశారు. పొన్నం సత్తయ్య అవార్డు అందుకున్న మొగిలయ్య దంపతులకు ఇల్లు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. మొగిలయ్య మరణంతో ఆయన స్వగ్రామం దుగ్గొండిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ‘బలగం’ దర్శక నిర్మాతలు వేణు, దిల్ రాజు సంతాపం వ్యక్తం చేశారు.