Saturday, April 5, 2025

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి వేడుకలు.

సంగెం / డిసెంబర్ 07( పి సి డబ్ల్యూ న్యూస్)


честные казино с быстрыми выплатами
бездепозитные бонусы казино
играть в лучшем казино на деньги
база казино с бездепозитным бонусом
онлайн казино России
casino oyunu

ప్రపంచ మేధావి, రాజ్యాంగా నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను, స్మరించుకుంటూ మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దామెర కిషోర్ మాదిగ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి ఆయన ఉన్నత ఆశయాల నెరవేర్పు కై ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దామెర కిషోర్ మాదిగ మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం భావ ప్రకటనకు సమ సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పితా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమాజ నిర్మాణంలో బాబా సాహెబును ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితి సింబల్ ఆఫ్ నాలెడ్జిగా గుర్తించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి కోడూరి రాజు, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు బాషిపాక రామ్ జ్యోతి, కలకోట్ల యకంభ్రం, నార్లవాయి ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు దామెర మనోహర్, ఎమ్మార్పీఎస్ నాయకులు మొలుగూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles