హాస్టళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
సంగెం/ నవంబర్ 24 (పి సి డబ్ల్యూ న్యూస్ )
మండల కేంద్రం కస్తూర్బా పాఠశాల, గిరిజన బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం రోజు మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సమస్యలు ఉంటే రాసి కంప్లెంట్ బాక్స్ లో వేయాలని, ఎక్కువ రోజులు నిలువ ఉన్న ఆహారం తినెడం తో ఫుడ్ పాయిజన్ అవుతుందని దీనిని తల్లితండ్రులు గమనించాలన్నారు. కస్తూరిబా పాఠశాలలో విద్యార్థుల తల్లితండ్రులు వాటర్ సమస్య ఉందని తెలపడంతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మినరల్ వాటర్ ప్లాంట్ ను మంజూరు చేశారని, వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. అదేవిధంగా పిల్లలను పలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.