PCW News

Breaking
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

సంగెం: నవంబర్ 23 (పిసిడబ్ల్యూ న్యూస్):
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ సంఘటన సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో జరిగింది. సంగెం ఎస్సె నరేష్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. ఆశాలపల్లి గ్రామానికి చెందిన మాడిశెట్టి రవికుమార్ ఈ నెల 16న వ్యవసాయ బావి వద్ద రాత్రి పురుగుల మందు తాగి పడి ఉండగా పక్కనే దారిలో వెళ్తున్న వినయ్ గమనించి అతని దగ్గరికి వచ్చి చూసేసరికి మందు వాసన గమనించి వెంటనే అతని కుమారుడు ఉదయ్ కుమార్ కు ఫోన్ చేయగా ఉదయ్ కుమార్ వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఐదు రోజులు చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం రవికుమార్ మరణించాడని డాక్టర్లు తెలిపారు. తన మరణం ఎలాంటి అనుమానం లేదని కుమారుడు ఉదయ్ కిరణ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సైనరేష్ కుమార్ తెలిపారు.