తొర్రూరు – అక్టోబర్ 5 పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో ఈనెల 11వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు అమ్మాపురం రోడ్డు నితిన్ భవన్ తొర్రూర్ లో ప్రతిభ పురస్కార్ అందజేయబడును. తొర్రూరు మండల పిఓపిఏ (టి ఆర్ పి ఎస్) ఆతిథ్యంతో మానుకోట జిల్లా స్థాయిలో 18 మండలాల పద్మశాలి విద్యార్థినీ విద్యార్థులకు 2024 లో పీజీ మెడిసిన్ ఎంబీబీఎస్ ,బి ఏ ఎం ఎస్ ,బి డి ఎస్, ఐఐటి ,ఎన్ఐటి ,త్రిబుల్ ఐటీ, లలో అడ్మిషన్ సాధించిన వారికి మరియు ఇంటర్ ,పదవ తరగతిలో ఉత్తమగ్రేడ్లు సాధించిన ప్రతిభావంతులైన పద్మశాలి విద్యార్థిని, విద్యార్థులకు మరియు 2024 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అభ్యర్థులకు రాష్ట్రస్థాయి క్రీడా పథకాలు సాధించిన వారికి పద్మశాలి ప్రతిభా పురస్కారం 2024 ఈనెల 11వ తేదీ శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు వందేమాతరం ఫౌండేషన్ నితిన్ భవన్ తొర్రూర్ నందు నిర్వహించబడునని ఒక ప్రకటన ద్వారా తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మరియు వివిధ మండలాల్లోని పద్మశాలి సంఘం బాధ్యులు పోపో బాధ్యులు అనుబంధ సంఘాల బాధ్యులు కుల బాంధవులు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వ్యాపారులు మేధావులు మరియు విద్యార్థిని విద్యార్థులు అందరికీ ఇవే మా స్వాగతం ఆహ్వానం.
ముఖ్యమైన గమనిక
అభ్యర్థులు మార్కుల మేమో, ర్యాంక్ కార్డ్స్, జిరాక్స్ మరియు బయోడేటా పాస్పోర్టు ఫోటోలు 9వ తేదీ బుధవారం సాయంత్రం ఐదు గంటల లోపల 9441670810 లేదా 9441055082 లేదా 9440672321 నెంబర్లకు వాట్సాప్ ద్వారా పంపగలరు. లేదా సంధ్య ప్రింటర్స్ తొర్రూర్, మహాలక్ష్మి క్లాత్ స్టోర్ తొర్రూర్ నందు జిరాక్స్ కాపీలు ఇవ్వండి.