Wednesday, January 22, 2025

సఖి జాతీయ మహిళా మండలి ఖమ్మం సెంట్రల్ ఆఫీస్ లో రెండు నిరుపేద కుటుంబాలకు సహాయం..

మ్మం అక్టోబర్ 5 (పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి): ఖమ్మం సెంట్రల్ ఆఫీసులో ఈరోజు ఖమ్మం జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబాలు పరిణి వెంకటమ్మ , షేక్ రజియా కుటుంబాలకు 25 కేజీల చొప్పున రెండు బియ్యం దిక్కిలు 25కేజీలు , 25కేజీలు చొప్పున 50 కేజీలు సహాయం చేయడం జరిగినది . సఖి నిరుపేద కుటుంబాలకు సహాయం చేస్తుంది . సఖి వృద్ధులను ఆదుకుంటుంది . సఖి అనాధ బాలబాలికలను ఆదుకుంటుంది . సఖి జాతీయ మహిళా మండలి ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఉంటుంది . సఖీ జాతీయ మహిళా మండలి సేవా దృక్పథంతో ఏర్పడినది . రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలను ఆదుకుంటూ జాతీయస్థాయిలో, జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది . ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది . సఖి సేవాపరంగా భవిష్యత్తులో శాకోప శాఖలుగా , మహా వృక్షములా మహాసముద్రం లా , ఖండంతరాలు దాటి అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించాలని , ప్రతి మహిళా సోదరీమణి కుటుంబం ఉజ్వల భవిష్యత్తును అందుకునే దాకా,ప్రతి సోదరీమణి ఆర్థికంగా ముందుకు పోయే దాకా సఖి అందరి సంక్షేమం కోసం , శ్రేయస్సు కోసం ముందుకు పోతుందని పౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ తెలియజేశారు . ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రెజరర్ రాయల సంధ్య , నేషనల్ కన్వీనర్ దండమూడి గిరిజ , నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనిక గౌరీ , నేషనల్ కోకన్వీనర్ షేక్ సోనీ , నేషనల్ కో- కన్వీనర్ పత్రి అనసూయ , నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రణబోతు ఉమా , నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దుగ్గిరాల కోటేశ్వరి , నేషనల్ జాయింట్ సెక్రెటరీలు మహేశ్వర పుమాధవి , ఊటుకూరు సింధు , నేషనల్ కార్యదర్శి సిహెచ్ నాగమణి , నేషనల్ కమిటీ మెంబర్స్ గంగుల శ్రీదేవి , కేశవపట్నం రాజ్యలక్ష్మి , స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్లం స్వరూప , డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల శాంతి , షేక్ సఫీయ , సరోజ , అనసూయ , సుదిష్ణ తదితరులు పాల్గొన్నారు .

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles