Sunday, March 8, 2026

కోర్టు యార్డు కాలనీ వాసుల సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తా. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రిరాజశేఖర్ రెడ్డి..

పిసి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి( మల్కాజ్గిరి) మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని కోర్ట్ యార్డ్ కాలనీ వాసులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ని కలిసి మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, చాలా కాలం నుండి కాలని లో డ్రైనేజ్ పొంగుతూ రోడ్ల పైకి ప్రవహిస్తుందని, అధికారులు ఎన్ని అభ్యర్థనలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే కాలనిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానని డ్రైనేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తానని అన్నారు

Related Articles

Latest Articles