Saturday, April 5, 2025

లయన్స్ క్లబ్ తొర్రూర్ ఆధ్వర్యంలో ఉచిత మేగా వైద్య శిబిరం..

తొర్రూరు ప్రతినిధి పిసి డబ్ల్యూ న్యూస్: డాక్టర్ గుండాల మురళీధర్ గారు డి .ఎం. హెచ్. ఓ. మహబూబాబాద్.లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ వారి ఆధ్వర్యంలో 4 శుక్రవారం నలయన్ కీర్తిశేషులు దుర్గరాజు వెంకట్రామారావు (పట్వారి) స్మారకార్థం స్థానిక లయన్స్ భవన్లో తోరూర్ ప్రైవేట్ డాక్టర్స్ మరియు మెడికల్ అసోసియేషన్ వారి ఆర్థిక సహకారంతో, లయన్ నవీన్ కుమార్ అధ్యక్షతన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినైనది. అధ్యక్షులు లయన్ నవీన్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ సమాజంలోని ప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాలు పర్యావరణ అసమతుల్యత వలన ఏర్పడే సీజనల్ వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలు, ఈ మాసంలో ఎక్కువగా వస్తుండడం వలన ఈ మెగా వైద్య శిరమును నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ గుండాల మురళీధర్ డి. ఎం. హెచ్. ఓ. మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ లైన లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషమని పేద ప్రజలకు ఎంతో సహకారంగా ఉంటుందని వారి అభిమానాన్ని చురగొన్నవారు అవుతారన్నారు. తొర్రూర్ సి ఐ జగదీష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు వారు ప్రతి రోజు ఏదో ఒక సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు అవసరమయ్యేది చేస్తున్నారన్నారు. ఈ శిబిరం క్యాంపు చైర్మన్ డాక్టర్ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం మా ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. చార్టర్ ప్రెసిడెంట్ పి డి జి లయన్ డాక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పుల వలన సీజనల్గా వచ్చే వ్యాధులను గుర్తించి ఈ శిబిరంలో ఉచిత మందులు ఇవ్వడం జరుగుతుందని కంటి శుక్లాల పరీక్షించి అవసరమైన వారికి ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు ఈ వైద్య శిబిరంలో 382 మందిని పరీక్షించి వారికి తగిన మందులను ఉచితముగా ఇస్తూ 25 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని నిర్ధారణ చేయనైనది ఈ శిబిరంలోని పేషెంట్లకు పులిహోర పొట్లాలను అందించని అయినది ఈ శిబిరంలో పి డి జి లక్ష్మీనరసింహారావు, గాట్ వెంకట్ రెడ్డి, డాక్టర్ శారద ,విశ్వేశ్వరరావు, పి ఆర్ సి ఆరుట్ల వేణుగోపాల్ డిస్టిక్ చైర్ పర్సన్ ఫర్ హెల్త్ కాంప్స్, జెడ్ సి శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి లయన్ రమేష్, కోశాధికారి లయన్ శంకర్, ఫాస్ట్ ప్రెసిడెంట్, వెంకట్ రెడ్డి, పిఆర్సి వీరభద్రరావు పి జెడ్ సి టి వెంకటేశ్వర్లు, పి వెంకటేశ్వర్లు దామెర సరేష్ , డాక్టర్ రామ నర్సయ్య, మున్నూరు కోటయ్య, కోనే ప్రభాకర్, నల్ల కృష్ణమూర్తి, దారం కుమారస్వామి, వేముల రమేష్, పెరుమాండ్ల రమేష్, డి నగేష్ దారం కుమారస్వామి, ఎం రవీందర్ రెడ్డి, టి శ్రీనివాస్, కిన్నెర పాండు, రమేష్ కుమార్, బోనగిరి వేణుమాధవ్, సోమ రాజశేఖర్ , మరియు డాక్టర్ అనిల్ భూక్య, డాక్టర్ శ్రీనివాస్, కార్తీక్, డాక్టర్ సురేష్ శిబిరానికి సహకరించిన డాక్టర్స్ కు మరియు తొర్రూర్ మెడికల్ షాప్ అసోసియేషన్ సభ్యులకు లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles