Saturday, March 7, 2026

కాకాకు ఘనంగా నివాళులర్పించిన నిమ్మాని శేఖర్ రావు..

హనుమకొండ ప్రతినిధి:  (పీసీ డబ్ల్యూ న్యూస్)  అణగారిన వర్గాల ప్రతినిధి.. అట్టడుగు పేదల పెన్నిధి.. జాతీయ స్థాయి పదవులకు వన్నె తెచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ
స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) 95వ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ నందు గల ఆయన విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, గడ్డం వెంకటస్వామి కుమారులు గడ్డం వినోద్ , వివేక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు లతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. 70 ఏండ్ల కార్మిక ప్రస్థాన ప్రయాణంలో, ఐదు దశాబ్దాల రాజకీయ జీవిత గమనంలో కాకా చెరగని ముద్రనే వేసుకున్నారనీ తెలిపారు.

Related Articles

Latest Articles