PCW News

Breaking
కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలనపై సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారు.. పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య..

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన వేడుకలు

సంగెం, ఏప్రిల్ 29 (పిసిడబ్ల్యూ న్యూస్): వరంగల్ జిల్లా సంగెం మండలo లోహిత గ్రామలో జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2013-2014 పదవ తరగతి చెందిన 22 మంది పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం పాఠశాలలో ఏర్పాటు చేసుకున్నారు . నాటి సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. సరిగ్గా పదేళ్ల తరువాత వారంతా ఒక చోట చేరి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎంజాయ్ చేశారు. విద్యార్థి దశలో చిలిపి చేష్టలు మరువలేనివని, విద్యా బుద్ధులు నేర్పిన గురువులు ప్రధానోపాధ్యాయులు యుగంధర్, ఉపాధ్యాయులు దయాకర్, భుజంగరావు, గుండు రవి, జ్యోతి, పద్మ, రమాదేవి, సాంబమూర్తి, సంధ్యారాణి, సత్యనారాయణ, శ్రీహరి, వేణు, అటెండర్ శంకర్ తదితరులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. నాటి ఉపాధ్యాయులను శాలువతో ఘనంగా సత్కరించి వారు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః అని వారి పాదాలు తాకి ఆశీస్సులు స్వీకరించారు. సుమారు 22 మంది పూర్వ విద్యార్థులందరూ ఒకేచోట చేరవడంతో సందడి నెలకొని ముఖాల్లో వెలుగులు నిండాయి. సాయంత్రం వరకు తోటివిద్యార్థుల పిల్లలతోసందడిగా గడిపారు. ఇక నుంచి టచ్‌లో ఉండాలంటూ ఫోన్‌ నంబర్లు తీసుకోవడంతో పాటు మధుర జ్ఞాపకాలను తమ సెల్‌ఫోన్లలో బంధించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.