Saturday, March 7, 2026

చలో తుక్కుగూడ “జనజాతర” సభ కు తరలి వెళ్లిన నాయకులు

పరకాల ప్రతినిధి: హైదరాబాద్ లో శనివారం సాయంత్రం 4-30 గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీ పిసిసి అద్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన “జనజాతర” సభకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో పరకాల మండలం నుంచి పది బస్సుల్లో సుమారు ఆరువందల కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి హైదరాబాద్ తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన జనజాతర సభలో ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్గే కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనున్నారని, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఇదే తొలి ఎన్నికల సంగ్రామ సభ కాబట్టి ముఖ్యంగా ఐదు గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త ‘ మేనిఫెస్టో” రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పరకాల మండల,పట్టణ మరియు నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles