Sunday, April 6, 2025

అమ్మ ఆదర్శ పాఠశాలలలో జూన్ పది లోగా పనులు పూర్తి చేయాలి. యం.పి.డి.ఓ పెద్ది ఆంజనేయులు.

జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు పరకాల ‌మండల పరిధిలోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులకు మండల విద్యాశాఖ అధికారి యస్ రమాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలలలో అత్యవసరమైన పనులను జూన్ 10 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు . ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాదికారి యస్ రమాదేవి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చేయవలిసిన పనులు వివరించారు.1.పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన. 2.బాలికల మరుగుదొడ్ల నిర్మాణం. 3.త్రాగునీటి సరఫరా.4.చిన్న మరియు పెద్ద మరమ్మతులు.5.మరుగుదొడ్లను మరమ్మతు నిర్వహణ.6.తరగతి గదుల విద్యుద్దీకరణ.7.పాఠశాల పరిశుభ్రత నిర్వహణ. 8.సౌరఫలకాల ఏర్పాటు ద్వారా విద్యుత్ బిల్లు తగ్గించుట.9.పాఠశాల నిర్వహణ ఏకరూప దుస్తు లు కుట్టించుట. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసి తొమ్మిది రకాల పనులను కమిటీల ద్వారానే నిర్వహించాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్ గా, స్థానిక విఓ మెంబర్ కన్వీనర్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా విధ్యార్థుల తల్లి తండ్రులు ఉంటారని మహిళా శక్తిని ఉపయోగించి పాఠశాలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుట, పాఠశాల పర్యవేక్షణ మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు అవసరమైన ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిశుభ్రత మొదలగు కార్యక్రమాలను పాఠశాలల్లో ఈ కమిటీల ద్వారా చేపట్టడం జరగాలని పలు మార్గదర్శక సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సురేందర్, సాoబయ్య , మధు, గౌస్, తిరుపతి రావు, అశోక్ ఏ.ఈ రాజు , IKP APM క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles