PCW News

Breaking
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే

వేసవిలో గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, జాగ్రత్తలు పాటించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు వెల్లడి

తొర్రూర్, ఏప్రిల్ 3 ,( పిసిడబ్ల్యూ న్యూస్); భానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతుందని ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున గ్రామాలలోని గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెల్లికుదురు వైద్యురాలు శారద తెలియపరిచారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పి సి డబ్ల్యూ న్యూస్ జర్నలిస్ట్ మనోహర్ స్వామి వైద్యురాలు శారద తో ముఖాముఖి. గత వేసవి కాలం కన్నా ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని అత్యవసరమైతేనే వృద్ధులు ,గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ప్రయాణాలు చేయాలని కోరారు. గృహంలో చల్లటి ప్రదేశం ఏర్పాటు చేసుకొని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రయాణాలు చేసి వచ్చిన వెంటనే మంచినీటిని సేవించకుండా 15 నిమిషాలు వేచి ఉండి అనంతరం మంచినీటి సేవించాలని లేనిపక్షంలో శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతలకు వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వీలైనంతవరకు పగలు 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లో వంట గదిలో కూడా ఉండకుండా చూసుకోవాలని అన్నారు. వేసవికాలంలో చల్లటి పానీయాలు కూల్ డ్రింక్స్, టీ కాఫీలకు దూరంగా ఉంటే మంచిది అన్నారు. శరీరంలో ఉష్ణోగ్రతలు 40 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు విపరీతమైన చెమట, దాహం వేయడం శరీర బలహీనత, తల తిరిగినట్లుగా అనిపించడం, కండరాలు పట్టేసినట్లుగా లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకు వెళ్లాలని అన్నారు.ఈ వేసవిలో అజాగ్రత్తగా ఉండి ప్రయాణాలు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని ప్రత్యేకంగా సూచించారు.