Saturday, April 5, 2025

దుర్వాసన తో నిండిన మేడారం జాతర పరిసరాలు

-జంతువుల కళేబారాలతో కుళ్ళిపోయి దుర్వాసన.

-తినే ఆహార వస్తువుల పై ఈగల సమూహం.

-ప్లాస్టిక్ కవర్లతో, చెత్తతో నిండిపోయిన ప్రదేశాలు.

ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ముగిసి 13 రోజులు గడుస్తున్నా నేటి వరకు మేడారం గ్రామంలో పారిశుద్ధ్య పనులు పూర్తి కాలేదు. దీంతో మేడారం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతుంది. జంతు కళేబరాలు, ప్లాస్టిక్ కవర్లు, విస్తరాకులు, చెత్తా చెదారంతో కుళ్ళిన దుర్వాసన వెదజల్లుతుందని బుధవారం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని కోరుతున్నారు. ఆ గ్రామంలో ప్రతి చోటా ఈగలే కనిపిస్తున్నాయి.తినే ఆహార వస్తువుల మీదా, వ్యవసాయ పొలాలలో ఎక్కడ చూసినా ఆ గ్రామం అంతా ఈగల తో నిండిపోయింది.అయితే జాతరకు వచ్చిన భక్తులు మేకలు, కోళ్లు, ఇంకా అనేక విధాలుగా మొక్కులు చెల్లించుకున్నారు. అయితే మేకలు, కోళ్ల వ్యర్థాలు ఏక్కడిపడితే అక్కడే వదిలే యడంతో అవి అన్ని కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. అంతే కాకుండా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కవర్లతో మేడారం పరిశ్రమల ప్రాంతాల్లో నిండిపోయాయి.కుళ్లిన జంతు కళేబరాలతో కంపు.. మేడారం గ్రామంలోని సమీప పంట పొలాల్లో జంతు కళేబరాలు ఎక్కడివక్కడే ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాతర సమయంలో పంటపొలాల్లో తాత్కాలికంగా వెలిసిన కర్ర బొంగుల షెడ్డులు, జాతర సమయంలో నెలకొన్న జంతువుల వ్యర్థా పదార్థాలతో తమ పంట పొలాలు నాశనమయ్యాయని సమీప రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా ఎకరం పంట పొలంలో ఉన్న వ్యర్థాలు, చెత్తాచెదారాలను, కర్రబొంగులను తొలగొంచి యధావిధిగా తమ వ్యవసాయం కొనసాగించాలంటే ఇబ్బందకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎకరం భూమి శుభ్రం చేయడానికి రూ.20వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దుర్వసన కారణంగా తమ పంట భూమిలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles