PCW News

Breaking
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే

సమాజంలో మాతృత్వానికి మించిన దైవం లేదు. పరకాల సబ్ రిజిస్టర్ సునీత

పరకాల, మార్చి6 (పిసిడబ్ల్యూ న్యూస్): సమాజంలో మాతృత్వానికి మించిన దైవం లేదని సబ్ రిజిస్టర్ సునీత అన్నారు. బుధవారం పట్టణంలోని హుజురాబాద్ రోడ్ లో ఉన్న బాలాజీ ప్రైవేట్ పాఠశాలలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోసఫ్ అధ్యక్షతన ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయగా సబ్ రిజిస్టర్ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకి అంతరించిపోతున్న నైతిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అందుకు నిదర్శనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలే అని చెప్పవచ్చు. సృష్టిలో అమ్మ అని అనిపించుకునే గౌరవం ఒక మాతృత్వానికి తప్ప దేనికి లేదన్నారు . ప్రతి ఒక్కరూ మాతృత్వాన్ని దైవంతో పూజించబడినప్పుడే సమాజం బాగుపడుతుంది అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల పాల్గొన్న విద్యార్థుల తల్లులకు బహుమతులను ప్రధానం చేశారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్ రిజిస్టర్ సునీతను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.