PCW News

Breaking
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే

బిఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు

బిఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు

నడి కూడా మండలం లో వలసల జోరు..

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రేవూరి

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా

నడికుడ, మార్చి6 (పిసిడబ్ల్యూ న్యూస్): మండలానికి చెందిన బీఆర్ఎస్‌, బిజెపి నాయకులు, కార్యకర్తలు సుమారు 500 మంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు బుధవారం నడి కూడా మండల కేంద్రంలోని మారుతి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీ పి సి సి రాస్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య మాజీ ఎమ్మెల్యే మొల్గూరి బిక్షపతి తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ నాయకులు ఎన్నో ఒడిదుడుకులను, ఇబ్బందులను ఎదుర్కొన్నారని గత అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని వారి సేవలను మర్చిపోనని అన్నారు. కొత్త, పాత వారి కలయికతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సిన గురుతర బాధ్యత ప్రతి కార్యకర్త పై ఉందని ఆయన అన్నారు. నీళ్లు నిధులు నియమాకాల పేరుతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాలేశ్వరం పేరు తో దోపిడీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ కుటుంబం ఉద్యోగాలు పొందారని అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అధిక నిధులు కేటాయించి నిధులు కేసీఆర్ కుటుంబం దోచుకుని తిన్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలకుల వైఖరిని చూసి ప్రజలు అసహించుకుని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పాతాళంలో పాతర పెట్టారని విమర్శించారు.ప్రజల ఆశీర్వాదంతో గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గత మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినా ఆర్థిక ఇబ్బందులు ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్ హామీలను నెరవేర్చామని, యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టిందని అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇప్పటికే 30వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఈనెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించడం జరుగుతుందని ఇప్పటికే తొలి విడతగా నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగినది అన్నారు.రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బీ అర్ యస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని బిజెపి కి క్యాడర్ లేదని అందుకే ఆయా పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని వారిలో నిజాయితీపరులైన వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరుగుతున్నదని అన్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంటు ఎన్నికలలో స్థానంలో 20 వేల రూపాయల మెజార్టీ పరకాల నియోజకవర్గం నుండి చూపిస్తామని అధిష్టానానికి మాట ఇచ్చానని మాట నిలుపుకునేందుకు ప్రతి కార్యకర్త ఒక పార్లమెంటు మెంబర్గా భావించి పూర్తి సమయం కేటాయించి పనిచేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడీ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు మండల పార్టీ అధ్యక్షులు వివిధగ్రామల అధ్యక్షులు మహిళలలు యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.