రైతుల ఆర్థిక అభివృద్ధికి నూతన ఎరువుల గోదాం,ఎరువుల షాపు ప్రారంభోత్సవం
–ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సౌజన్యంతో నిర్మించిన ఎరువుల గోదాం.
–తీగరాజు పల్లి గ్రామo సోమ్లా తండాలో 18.50 లక్షలతో.. కాపుల కనపర్తి రైతు సేవా సహకార సంఘం.
–పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.
సంగెం మండలం తీగరాజు పల్లి గ్రామ పరిధిలోని సొమ్లా తండా లో రూ.18.50 లక్షలతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సౌజన్యంతో నిర్మించిన కాపుల కనపర్తి ఎఫ్ ఎ సి ఎస్ గోదాం ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. తీగరాజుపల్లి గ్రామంలోని బొడ్రాయి, దర్గా దుర్గమ్మ తల్లిలన దర్ర్శించుకుని పూజల నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అన్నదాతలకు అండగా నిలుస్తాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రైతాంగం సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రము సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార వ్యవస్థ దోహదపడుతుందని కానీ 90% సహకార సంఘాలు ఆర్థిక ఇబ్బందులతో నిర్వీర్యం అయ్యాయని వాటి పునర్నిర్మానానికి చేయూతనందించి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని అన్నారు..రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు కూడా సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాల్ని మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని పార్లమెంట్ ఎన్నికలలోపే రైతు రుణ మాఫి, రైతు భరోసా అమలు కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అధికారులు పంటలు సాగు చేస్తున్న రైతుల వివరాలను అలాగే రైతుల అప్పుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారని ఆది పూర్తి కాగానే రుణమాఫీ, రైతు భరోసా ను ప్రారంభిస్తారని అన్నారు. రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం త్వరలో రైతు కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే రోజులలో రైతాంగ సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని రైతుల పంటలను నిలువ చేసుకునేందుకు అవసరమైన మేర గోదాముల నిర్మాణానికి కృషి చేస్తానని ప్రతి గ్రామంలో ఒక రైతు పొదుపు సంఘం ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు.