Wednesday, July 22, 2026

జిల్లా కలెక్టర్ సీక్త పట్నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పరకాల ఆర్డిఓ నారాయణ

పరకాల, మార్చి 5 (పిసిడబ్ల్యూ న్యూస్): ఇటీవల బదిలీలో భాగంగా హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ కార్యాలయంలో పరకాల ఆర్డిఓ గా నారాయణ బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకొని, మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అదేవిధంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట్ రెడ్డి, హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ సిక్త పట్నాయక్ కు పూల మొక్కలను అందించారు. ఈ సందర్భంగా నూతన అధికారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Articles

Latest Articles