విశ్రాంత రిటైర్డు ఉద్యోగులు గ్రాడ్యుయేట్ యం.యఎల్.సి ఎనికల్లో పోటీకి సిద్ధం
ఖమ్మం, మార్చి 5(పిసిడబ్ల్యూ న్యూస్): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఖమ్మం , నల్గొండ , వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన 11 జిల్లాల రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శుల సమావేశం జరిగింది . ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఖమ్మం జిల్లా అద్యక్షులు శ్రీ కళ్యాణం కృష్ణయ్య మాట్లాడుతూ శాసన మండలికి గతంలో ఎన్నిక అయిన టీచర్స్ యం.యల్.సి లు మరియు గ్రాడ్యుయేట్ యం.యఎల్.సి.లలో ఒకరిద్దరు తప్ప ఉద్యోగుల , విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పట్టించుకున్న వారే లేరని, అధికార పార్టీ కి అనుకూలంగా వ్యవహరించారని ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు , విశ్రాంత ఉద్యోగుల పక్షాన నిలిచి వారికి అండగా ఉండే వ్యక్తి నీ రాబోవు ఖమ్మం , నల్గొండ , వరంగల్ యం.యఎల్.సి గ్రాడ్యుయేట్ ఎనికల్లో పోటీకి పేట్టాల్సిన అవసరం ఉందని అందుకు అనుగుణంగా ఉద్యోగ , విశ్రాంత ఉద్యోగుల నుండి కాండిడేట్ ఉంటే బాగుంటుందని అన్నారు . ఈ సందర్భంగా అద్యక్షులు శ్రీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రo ఏర్పడిన తరువాత గత దశాబ్ద కాలంగా విశ్రాంత ఉద్యోగుల , ఉద్యోగుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వీటి గురించి శాసన మండలిలో కనీసం చర్చకు పెట్టే నాధుడు లేని పరిస్తితి వచ్చినదని అందుకే రాబోవు ఉమ్మడి ఖమ్మం , వరంగల్ , నల్గొండ జిల్లాల నుండి శాసన మండలికి జరగబోయే గ్రాడ్యుయేట్ యం.యల్.సి ఎన్నికలలో విశ్రాంత ఉద్యోగులు , ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన అభ్యర్దిని పోటీ పెడితే బాగుంటుందని అన్నారు . మన తరపున ఎన్నికైన సభ్యులు అయితే మన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు . సెక్రెటరీ జనరల్ శ్రీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికే మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్స్ నమోదు చేసే కార్యక్రమం చురుకుగా జరుగుతుందని ఈ నెల 14 ఓటరు నమోదు కు చివరి తేది కావున ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్లు , విశ్రాంత ఉద్యోగులు , ఉపాధ్యాయులు , ఉద్యోగులు అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం , నల్గొండ , వరంగల్ మూడు ఉమ్మడి జిల్లాల రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిదులు గ్రాడ్యుయేట్ యం.యల్.సి. ఎన్నికల్లో పోటీ చేసే విషయం పై సుదీర్ఘంగా చర్చించినారు . ఈ మూడు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ , ఉద్యోగ సంఘాల భాద్యులతో చర్చించి విశ్రాంత ఉద్యోగుల , ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షాన అభ్యర్దిని పోటీకి పెట్టాలని అన్నారు .ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు సీతారామయ్య , రాష్ట్ర కార్య దర్శి పైడిపల్లి శరత్ బాబు , రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మోహన్ , ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎర్నేని రామారావు , ఖమ్మం జిల్లా కార్యదర్శి యం.సుబ్బయ్య ,11 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల సుదీర్ఘంగా చర్చించారు . శాసన మండలిలో ఉద్యోగ ఉపాధ్యాయల , విశ్రాంత ఉద్యోగుల సమస్యల పై చర్చించాలి అంటే తప్పని సరిగా విశ్రాంత ఉద్యోగుల పక్షాన అభ్యర్దిని పోటీకి పెట్టాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు . ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కోశాధికారి శర్మ , జిల్లా కమిటీ సభ్యులు జనార్దన్ , రాజారావు , వేణు , సాంబ శివరావు , ఖమ్మం టౌన్ లోని నాలుగు యూనిట్ ల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు .