PCW News

Breaking
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే

చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్

వరంగల్, పిబ్రవరి28 (పిసిడబ్ల్యు న్యూస్):తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఎనుమాముల పోలీసులు అరెస్టు చేసి వారినుండి ఐదున్నర లక్షల విలువ చేసె బంగారు, వెండి వస్తువులను స్వాదీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం గ్రామానికి చెందిన రాపోలు రామకృష్ణ , జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లికి చెందిన పప్పుల సంపత్ మరియు కేతిరి కిరణ్ అనే ముగ్గురు దొంగలను ఎనుమాముల సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మామునూరు ఎసిపి సతీష్ బాబు మాట్లాడుతూ, ఈ ముగ్గురు దొంగలు తాగుడుకు బానిసై జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారని, ఎనుమాముల శివారు ఆరేపల్లిలోని ఒక ఇంటిలో తాళం పగుల గొట్టెందుకు ప్రయత్నించగా తాళం పగలకపోవడం చేత గడ్డపారతో వంటగధి కిటికి గ్రిల్స్ పగులగొట్టి లోపలికి వెళ్లి కప్బోర్డులో ఉన్న రెండు తులాల బంగారు నెక్లెస్ , ముద్ద బంగారం మరియు పధిహేను వంధల రూపాయలు, దొంగలించారని తెలిపారు. అలాగే పరకాల పట్టణంలోని రెండు ఇళ్ళలో వేసి ఉన్న తాళాలను పగులగొట్టి బీరువాలో ఉన్న ముద్ద బంగారం, చెవి కమ్మలు, చేతి గాజులు, సత్య నారాయణస్వామి విగ్రహం, కుంకుం భరణి, వెండి గిన్నెలు దొంగిలించారని, ఇట్టి మొత్తం సొత్తును అమ్ముకుంధామని బుధవారం ఈ ముగ్గురు దొంగలు వరంగల్ కు వస్తున్న క్రమంలో ఎనుమాముల కార్ల్మార్క్స్ నగర్ వద్ధ వాహనాలు తనిఖి చేస్తున్న ఎనుమాముల పొలీసులకు పట్టుబడ్డారని ఎసిపి తెలిపారు. ఈ సందర్బంగా సిఐ పి. కిషన్, సీసీఎస్ సి.ఐ శంకర్ నాయక్, ఎస్ఐ శ్రీకాంత్, ఎస్ఐ సంపత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మున్నా, వేణు, రవి, వెంకన్న, కిరణ్, మహేందర్, విజయ్, యుగేందర్, రవీందర్ లను ఏసిపి సతీష్ బాబు అభినందించారు.