కాజీపేట లో.. కేంద్ర ప్రభుత్వం వెంటనే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయాలి: 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ- సయ్యద్ రజాలి..
ఓరుగల్లు ప్రజల చిరకాల కోరిక అయినా.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ని మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ- సయ్యద్ రజాలి అన్నారు. సోమవారం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 554 రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధికి, 1500 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాసులు ప్రారంభానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న 62, 63వ డివిజన్ కార్పొరేటర్లు, రైల్వే అధికారులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా 63 డివిజన్ కార్పొరేటర్ విజయ్ శ్రీ -సయ్యద్ రజాలి మాట్లాడుతూ.. కాజీపేట ప్రజల చిరకాల స్వప్నం అయిన కోచ్ ఫ్యాక్టరీ కాజిపేట్ లో డివిజన్ లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా కాజీపేట బోడగుట్ట ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారని, కావున భారత్ అమృత స్టేషన్ పథకంలో భాగంగా బొడగుట్ట కు ఆరోబి నిర్మించాలనికేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, కాజీపేట వాసులు తదితరులు పాల్గొన్నారు.