సమ్మక్క-సారాలమ్మను దర్శించుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
నడికూడ, ఫిబ్రవరి 23 (పీసీడబ్ల్యూ న్యూస్): కంటాత్మకూర్ తెలంగాణలో మూడో అతిపెద్ద జాతర కంటాత్మకూర్ శ్రీశ్రీశ్రీ సమ్మక్క-సారక్క వన దేవతలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి పసుపు, కుంకుమ, బెల్లం సమర్పించి గిరిజన అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర కమిటీ చైర్మన్ రాయిడి రాజిరెడ్డి , వైస్ చైర్మన్ బారాబరి వెంకటస్వామి, గ్రామ కమిటీ అధ్యక్షులు భైరపాక భద్రయ్య ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉంది అన్నారు, అలాగే జాతరలో అందుతున్న వైద్య సదుపాయల గురించి అక్కడ ఉన్న అడిగి తెలుసుకున్నరూ. గతంలో ఎన్నడు లేని విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. అమ్మవార్ల దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి, రాయపర్తి ఎంపీటీసీ పర్నెం శ్రీలత -మల్లారెడ్డి, గ్రామ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం మహేందర్, కంటాత్మకూర్ రాజు, కోశాధికారి బొమ్మకంటి విజేందర్, జాతర కమిటీ సభ్యులు, కంటాత్మకూర్ గ్రామా కమిటీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.