నడికూడ, ఫిబ్రవరి 23 (పిసిడబ్ల్యూ న్యూస్): మండలంలోని కంటాత్మకూర్ సమ్మక్క సారలమ్మ జాతరలో ప్లాస్టిక్ రహితoగా జాతరగా నిర్మించుకుందామని మండల వినియోగదారుల సమాచార అధ్యక్షుడు మహమ్మద్ జమాల్ ద్దీన్ అన్నారు. శుక్రవారం మండలంలోని కంటాత్మకూర్ మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద భక్తులకు ప్లాస్టిక్ నిషేదిక ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జమాల్ ద్దీన్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తీసుకెళ్లకుండా కాటన్ క్యారీ బ్యాగులు జూట్ సంచులు తీసుకొని రావాలని. దీనితో జాతర పరిసరాలు పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ రాయుడి రాజిరెడ్డి, అదిల్, జీవన్ రెడ్డి, చుక్క సతీష్, జాతర కమిటీ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.