జన్మస్థలమైన అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లకు సర్వం సిద్ధం వనదేవతల సేవలో అధికారులు ప్రజా ప్రతినిధులు
ఆత్మకూర్, ఫిబ్రవరి 21( పిసిడబ్ల్యూ న్యూస్ ): వనదేవతల జన్మస్థలమైన సమ్మక్క సారలమ్మ జాతరలో అన్ని ఏర్పాట్లకు సర్వం సిద్ధం అయ్యాయి. లక్షలాదిమంది భక్తులు వచ్చే ఈ జాతరకు వేలాది మంది అధికారులు సేవలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గత 20 రోజుల నుంచి సమ్మక్క సారలమ్మ వనదేవతలను భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆసియా ఖండంలోనే కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తరహాలోనే మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుంచి 24వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది. గత జాతర కంటే ఈసారి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు భక్తులు దర్శనానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.