PCW News

Breaking
కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలనపై సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారు.. పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య..

పరకాల లైబ్రరీలో వసతులు కల్పించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన నిరుద్యోగులు

హన్మకొండ జిల్లా పరకాలలో శిథిలావస్థకు చేరిన శాఖా గ్రంధాలయం ను పునరుద్ధరించి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు సరైన వసతులు కల్పించాలని లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రేవూరి ప్రకాష్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు ఎమ్మెల్యే తో తమ గోడు ను వెల్లడించారు. పరకాల లైబ్రరీ పురాతన భవనంలో కొనసాగుతోంది. చాలా ఇరుకుగా ఉన్న భవనం సరైన వెంటిలేషన్ లేక చీకటిగా ఉంటుందని , ఉక్కపోతగా ఉంటూ కరెంట్ పోయినపుడు ఇన్వర్టర్ సౌకర్యం లేదని , సివిల్స్, గ్రూప్ 1 , గ్రూప్ 2 , గ్రూప్ 4 మరియు ఇతర పోటీ పరీక్షల మెటీరియల్ లేక ఇబ్బందిగా ఉందని, కంప్యూటర్ లు లేక సమాచార సేకరణ ఇబ్బందిగా ఉందని దయచేసి ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పరకాల చుట్టు పక్క గ్రామాల నుండి దాదాపు 30 మంది నిరుద్యోగులు చదువుకుంటున్నారని అన్నారు. మరియు లైబ్రరీ ప్రాంగణంలో మూత్రశాలలు లేవని అలాగే చుట్టూ పక్కన ఉన్న వివిధ షాపుల వారు లైబ్రరీ ప్రాంగణంలో మూత్రం పోయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుందని అభ్యర్థులు వాపోయారు. కావున దయచేసి లైబ్రరీ ని పునరుద్ధరించి సరైన వసతులు కల్పించాలని వేడుకున్నారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే రేవూరి.ప్రకాష్ రెడ్డి లైబ్రరీ ని సందర్శించి పరిశీలించి , లైబ్రేరియన్ విశ్వనాథ్ వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే పంచాయతీ రాజ్ ఏఈ కి ఫోన్ చేసి నివేదిక తయారు చేసి పనులు తక్షణమే పూర్తి చేసి నిరుద్యోగులకు ఆటంకం లేకుండా చేయాలని ఆదేశించారు. అనంతరం నిరుద్యోగ అభ్యర్థులతో మాట్లాడి ఏమైనా అవసరం ఉంటే నన్ను సంప్రదించండి అని భరోసా ఇచ్చారు.