PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

పట్టించుకునే నాధుడే లేడా?

పరకాల, ఫిబ్రవరి 15 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణం లోని హుజురాబాద్ రోడ్ బిట్స్ పాఠశాల ఎదురుగా కుప్పలు కుప్పలుగా చెత్త పోయడం దానిని మునిసిపాలిటీ సిబ్బంది తగులబెట్టడం వల్ల పాఠశాల విద్యార్థిని విద్యార్థులుఆ పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు పాఠశాల ఎదురుగా చెత్త పోసేది ఎవరు ఒకవేళ పాఠశాల వాళ్లే అయితే మునిసిపల్ సిబ్బంది ఏం చేస్తున్నారు. పట్టణం అవతల పోయాల్సిన చెత్త మరుగున పడుతుంటే శానిటేషన్ శాఖ వాళ్ళు ఎందుకు పట్టించుకోకుండా ఉంటున్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు ,చెత్త కాలబెట్టడం వల్ల వచ్చే వాయువు లు పాఠశాల లోని చిన్న పిల్లలు అస్వస్థతకు గురి అయ్యే ప్రమాదం ఉంది. అది కాకుండా పక్కనే పెట్రోల్ బంక్ ఉన్నది. ఇది ఇంకా చాలా ప్రమాదం అని తెలిసినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాఠశాల ఎదురుగా చెత్త పోయకుండా మునిసిపల్ సిబ్బంది చూడాలని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.