Saturday, April 5, 2025

భూపాలపల్లి, ఫిబ్రవరి 3 (పిసిడబ్ల్యూ న్యూస్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, ( సి ఐ టి యు,ఐ ఎన్ టి యు సి, ఏఐటీయూసీ,హెచ్ ఎం ఎస్, ఐ ఎఫ్ టి యు,బి ఆర్ టి యు,టి ఎన్ టి యు సి) కార్మిక సంఘాలు వివిధ రంగాల ఉద్యోగ సంఘాలు అఖిల భారత ఫెడరేషన్లు మరియు సంయుక్త కిసాన్ మోర్చా,రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక 2024 ఫిబ్రవరి 16న అఖిల భారత స్థాయిలో కార్మికుల సమ్మెతో పాటు గ్రామీణ బంద్ పాటించాలని నిర్ణయించాయని రమేష్ అన్నారు.ఈ నిర్ణయం లో భాగంగా మన రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కూడా సమ్మెలో భాగస్వాములు కావాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని, పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్ 22 సబ్ సెక్షన్( 1) అనుసరించి ఈ సమ్మె నోటీసు ఇస్తున్నామని పేర్కొన్నారు. 2024 ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బందులో మధ్యాహ్న భోజనం పథకం కార్మికులందరూ పాల్గొంటున్నారని ఈ సమ్మె నోటీసు ద్వారా DEO గారికి తెలియజేస్తున్నామని సమ్మెకు సంబంధించిన డిమాండ్లను అనుబంధంగా ఉంచామని,అవి మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలి,కార్మికుల్ని బానిసత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడులను రద్దు చేయాలి, మధ్యాహ్నం భోజనం నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు అమ్మడం ప్రైవేట్ పరం చేయడం ఆపాలి.కేంద్ర స్కీములకు బడ్జెట్ తగ్గించదు. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలి అన్ని రకాల ఆహార వస్తువులపై జిఎస్టిని ఉపసంహరించాలి. నూతన విద్యా విధానం 2022 చట్టాన్ని రద్దు చేయాలి. గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి. అవసరమైన గ్యాస్ను సబ్సిడీకి ఇవ్వాలి. గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వాలి. అక్రమ తొలగింపులు అరికట్టాలి.రాజకీయ వేధింపులు ఆపాలి. వంట సెట్లు వంట పాత్రలు తదితర మౌలిక వసతులు కల్పించాలి. కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలి. సామాజిక భద్రత కల్పించాలి. ప్రమాద బీమా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని రమేష్ అన్నారు. ఆయనతోపాటు, స్వర్ణలత, బక్కమ్మ, సంపూర్ణ,లావణ్య, లక్ష్మీ, రజిత, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles