Saturday, March 7, 2026

మైనారిటీ సెల్ అధ్యక్షునిగా మహమ్మద్ అలీ నియామకం..

పిసిడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి పరకాల: హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా మహమ్మద్ అలీని నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ వరంగల్ మైనార్టీ కమిటీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో రెండోసారి కూడా పరకాల పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియామకం కావడం హర్షనీయమని మైనార్టీ నేతలు, పార్టీ శ్రేణులు తెలిపారు. అంతకుముందు నియామక పత్రమును పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా మహ్మద్ అలీ అందుకున్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా మైనారిటీ కమిటీ నాయకులతో పాటు తన నియామకానికి సహకరించిన పరకాల ఎమ్మెల్యే కు, పరకాల పట్టణ కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు శక్తివంతం లేకుండా కృషి చేస్తానని అన్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో పరకాల పట్టణంలో మైనార్టీలకు ఏలాంటి కష్టం వచ్చినా చేదోడు వాదోడుగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

Related Articles

Latest Articles