గ్రీన్ వుడ్ పాఠశాలలో ఘనంగా 75 వ గణతంత్ర దినోత్సవ సంబరాలు
వరంగల్ నగరంలోని హంటర్ రోడ్ లో ఉన్న గ్రీన్ వుడ్ పాఠశాలలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ జి. భరద్వాజ నాయుడు, మరియు చల్లా ధర్మారెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించి భారత రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరు రాజ్యాంగం పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని నవభారత నిర్మాతలుగా విద్యార్థులు దేశం కోసం తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ హక్కులను దుర్వినియోగం చేయకుండా దేశం పట్ల నిబద్ధత ఉండాలని వారు మాట్లాడారు. విద్యార్థులు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలను అద్భుతంగా ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. ఎన్.సి.సి విద్యార్థులు నిర్వహించిన పెరేడ్, పిరమిడ్స్ ఆహుతులను విశేషంగా ఆకర్షించి అలరించాయి. ఈ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన క్రీడలు, వ్యక్తిత్వ, వ్యాసరచన పాటల పోటీలలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచి విద్యార్థులకు డైరెక్టర్లు బహుమతి ప్రధానం చేసి విద్యార్థులను అభినందించారు. పిల్లలందరికీ మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో జి.ఎం. ప్రభు కుమార్, ప్రధానోపాధ్యాయురాలు మంజులాదేవి, వైస్ ప్రిన్సిపాల్ మహేందర్, ఏ. సి. ఓ. లు శ్రీకాంత్, హర్షవర్ధన్, రుమానా, ఏ.ఓ. మురళి, హెచ్. ఆర్. వాసు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.