ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్127వ జయంతి వేడుకలు..
ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్127వ జయంతి వేడుకలు. -స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. -తెల్ల దొరల పాలన అంతం చేసిన వీర యోధుడు చంద్రబోస్. – దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు బోస్. సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు,యూత్ నాయకులు,గ్రామ యువత సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశo స్వతంత్ర దిశగా పనిచేయడంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారు. సర్పంచ్ గూడ కుమార్ స్వామి మాట్లాడుతూ… నేతాజీ 127వ జయంతి. ప్రతి సంవత్సరం జనవరి 23న నేతాజీ జయంతిని దేశ వ్యాప్తంగా ‘పరాక్రమ్ దివస్’గా ఘనంగా జరుపుకుంటాం. తన మాటలతో ప్రతి వ్యక్తిలోనూ స్వాతంత్యం కోసం పోరాడాలనే కాంక్ష రగిలించిన వీరుడు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాలి అడుక్కోవడం కాదు అనే ఆలోచన సుభాష్ చంద్ర బోస్ లో మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరిలోనూ కలిగిన వ్యక్తి. ఆయనలో ఆవేశం ఎక్కువ. ప్రతి మాటా ఓ తూటాలా ఉండి.. నాటి యువతకు స్వాతంత్య్రం కోసం పోరాడేలా చేసింది అని మాట్లాడారు.అనంతరం పెండ్లి పురుషోత్తం మాట్లాడుతూ.నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897న ఒడిశాలోని కటక్‌లో జన్మించారు. అతని తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్, ప్రభావతి దేవి. చిన్నప్పటి నుంచి అసాధారణ తెలివితేటలు ప్రదర్శించి చదువులో రాణిస్తూ… నేతాజీ ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు అయితే, 1921లో, భారతదేశంలో బ్రిటిష్ వారు చేసిన అన్యాయాల గురించి తెలుసుకున్న తరువాత, అతను మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి కట్టుబడి.. ఇంగ్లండ్‌లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో తన ప్రతిష్టాత్మక ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. అప్పుడే తన స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించడానికి భారతదేశానికి తిరిగి వచ్చాడు. “నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను” అనే అతని ప్రసిద్ధ నినాదం దేశ భక్తిని ప్రేరేపించిందని అతను తెలిపారు. దామెరుపుల చంద్రమౌళి మాట్లాడుతూ…నేతాజీ తో పాటు, బోస్‌ని దేశ్ నాయక్ అని కూడా పిలుస్తారు, ఈ బిరుదును రవీంద్రనాథ్ ఠాగూర్ అతనికి పెట్టారు. ఠాగూర్ నాయకత్వానికి, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ బిరుదును ఆయనకు ప్రసాదించారని చెబుతారు. సుభాష్ చంద్రబోస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే 1942లో, సుభాష్ చంద్రబోస్ భారతదేశాన్ని విముక్తి చేయాలనే ప్రతిపాదనతో హిట్లర్‌ను సంప్రదించాడు, అయితే హిట్లర్ ఆసక్తి చూపలేదు. బోస్‌కు స్పష్టమైన వాగ్దానాలు చేయలేదు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో విజయవంతమైన కెరీర్ ఉన్నప్పటికీ, స్వాతంత్ర్య పోరాటానికి తనను తాను అంకితం చేసుకోవడానికి బోస్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు అని మాట్లాడారు. కొనుకటి మొగిలి మాట్లాడుతూ….సుభాష్ చంద్రబోస్ జలియన్ వాలాబాగ్ ఊచకోత బోస్ జీవితంలో ఒక మలుపు. అది స్వాతంత్ర్య పోరాటంలో చేరడానికి అతన్ని ప్రేరేపించింది.1943లో, బోస్ బెర్లిన్‌లో ఆజాద్ హింద్ రేడియో, ఫ్రీ ఇండియా సెంట్రల్‌ను స్థాపించారు.నేతాజీ సుభాష్ చంద్ర ఫోటోతో కూడిన లక్ష రూపాయల నోటుతో సహా ఆజాద్ హింద్ బ్యాంక్ నోట్లను విడుదల చేసింది. 1921, 1941 మధ్య, బోస్ వివిధ భారతీయ జైళ్లలో 11 సార్లు ఖైదు చేయబడ్డాడు. ఆయన రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బోస్ మరణం చుట్టూ ఉన్న పరిస్థితులు నేటికీ మిస్టరీగా ఉన్నాయి. 1945లో జపాన్‌కు ప్రయాణిస్తున్నప్పుడు, ఆయన విమానం తైవాన్‌లో కూలిపోయినట్లు నివేదికలు అందాయి, కానీ దానిని రూఢీ చేసే సాక్ష్యాలు లభిచలేదు అని అతను తెలిపారు. అనంతరం గ్రామాల్లో ప్రతిమ రిలీఫ్ హాస్పటల్ వారిచే నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో భాగంగా అన్ని పార్టీల నాయకులు ఉమ్మడిగా వైద్య పరీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడ కుమారస్వామి,ఎంపీటీసీ కోనుకటి రాణి మొగిలి,ఉప సర్పంచ్ పెండ్లి శారద కుమారస్వామి,మాజీ ఎంపీటీసీ కడుదూరి సంపత్, మడత కేశవులు,దామెరుప్పుల చంద్రమౌళి,కక్కేర్ల వీరస్వామి, శేషాద్రి,వార్డ్ సభ్యులు స్వామి, ప్రశాంత్ గౌడ్,నాయకులు అనుముల కుమారస్వామి,పెండ్లి రమేష్,కంటే కుమారస్వామి,గూడ రాజేందర్,బాలకృష్ణ,పొన్నాల హరీష్,పరికీ యాకయ్య,వేల్పుల భద్రయ్య, వేల్పుల కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.