Saturday, April 5, 2025

జంతు సంరక్షణ సామాజిక బాధ్యత..

మొగుళ్లపల్లి: జంతు సంరక్షణ సామాజిక బాధ్యత అని జిల్లా పశు వైద్య,పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీదేవి అన్నారు. శనివారం మండలకేంద్రంలోని పశు వైద్యశాలలో జంతు సంరక్షణ పక్షోత్సవాల సందర్భంగా పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పశు వైద్యాధికారి శ్రీరాం నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జంతు సంరక్షణ పక్షోత్సవాలు ఈ నెల 30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జంతు హింసకు పాల్పడకుండా కరుణతో ఉంటూ వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు జిల్లాలో జంతు సంరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సహకరించాలని కోరారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని వన్యప్రాణులు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని అటవీ ప్రాంతానికి తరలించాలన్నారు. మూగజీవాలపై క్రూరత్వం చూపరాధన్నారు. జంతు హింస మానుకొని వాటి సంక్షేమానికి పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తారని తెలిపారు.రోడ్డు పై ప్రమాదానికి గురైన జంతువులను ప్రాథమిక చికిత్స అందించి సమీప పశువైద్యశాలకు తీసుకురావాలని సూచించారు.రాబోయే వేసవిలో పశువులకు, పక్షులకు దాహార్తిని తీర్చేందుకు చిన్న పాత్రలో నీటిని నింపి దాహం తీర్చాలని కోరారు.పశువుల పట్ల జాలి, దయ చూపాలన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ లు వెంకన్న,వెంకట్ రాజు, దివ్య పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles