పరకాల కేంద్రంగా నకిలీ అంబర్ విక్రయాలు?
పరకాల కేంద్రంగా నకిలీ అంబర్ విక్రయాలు?
-వాటిని తింటే పెదాలు చిట్లుతున్నాయి!
-గ్రామాలకు విచ్చలవిడిగా సరఫరా! నకిలీ అంబర్ విక్రయాలు పరకాల కేంద్రంగా కొనసాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అవి వివిధ గ్రామాలకు విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి. ఒకప్పుడు గుట్కాలు అంబర్ ప్యాకెట్లపై నిషేధం ఉన్నప్పుడు రూ.5 గుట్కా, రూ.10కి అంబర్ ప్యాకెట్లు అమ్మేవారు. నిషేధం సమయంలోను గుట్టుగా విక్రయాలు కొనసాగడం గమనార్హం. కరోనా సమయంలో గుట్కా రూ. 20కి, అంబర్ ప్యాకెట్ రూ.80 నుంచి రూ.100కు విక్రయించడం గమనార్హం. తదనంతరం ఏర్పడిన పరిణామాలతో పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఎక్కడ విధించారని, నిషేధం లేదని కోర్టు ఆదేశించడంతో తిరిగి గుట్కా, అంబర్ ప్యాకెట్లు విక్రయం జోరందుకుంది. ఇదే అదనుగా నకిలీ దందా! దీనిని అదనంగా తీసుకున్న పొగాకు ఉత్పత్తిదారులు అసలు అంబర్ ప్యాకెట్లను మారుగా కొత్త పేరుతో ఆ పొగాకులో అంబర్ ప్యాకెట్లు సృష్టించి మార్కెట్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. అసలు అంబర్ ధర రూ 20 ఉండగా రెండో రకానికి చెందిన ఆ పొగాకు ఉత్పత్తి ప్యాకెట్ ను రూ.15కు విక్రయిస్తున్నారు. గ్రామాలలో అసలు అంబర్ దొరకక రెండో రకానికి అలవాటు చేసుకున్నారు. అయితే అది తినేవారికి పెదాలు, చెంప లోపలి భాగాలు, చిట్లి పోతున్నాయని వేసన్నపరులు చెబుతున్నారు. ఆ నకిలీ పొగాకు ఉత్పత్తులను అరికట్టాలని కోరుతున్నారు. అంబర్ లాంటి ఉత్పత్తుల పాలిట వ్యసనపరులుగా మారిన వారు కరోనా లాక్ డౌన్ సమయంలో అంబర్ వినియోగానికి బదులుగా పొగాకును చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పేదల మధ్యన ఉంచుకోవడం ప్రత్యామ్నాయంగా మార్చుకున్నారు. ప్రస్తుతం రెండో రకం పొగాకు ప్యాకెట్లు మార్కెట్లోకి ప్రవేశించడంతో దానిని తిన్న వారు భోజనం చేసే సమయంలో చిట్లిపోయిన పెదాలు, దవడలతో మంట పుట్టిస్తున్న నేపథ్యంలో లబోదిబో మంటున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయం పై దృష్టి సారించాలని రెండో రకం పొగాకును నియంత్రించాలని వారు కోరుతున్నారు.