గడ్డి మందు అమ్మకాలపై అవగాహన సదస్సు
తెలంగాణ/పెద్దపల్లి.సుల్తానాబాద్:పిసిడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి:
గడ్డి మందు అమ్మే ముందు కొన్న వారి వివరాలు వారి కుటుంబ సభ్యులకు తెలపండి.రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ఐజి ఆదేశాల మేరకు పెద్దపల్లి డిసిపి రూపేష్ ఐపిఎస్, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి ఉత్తర్వుల ప్రకారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫెర్టిలైజర్ షాప్ యజమాలను పిలిపించి గడ్డి మందు కొనుక్కొని వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతూన్నాయి. దానికి సంబంధించి షాప్ యజమానులకు అవగాహన కల్పించడం జరిగింది.గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం వలన దానిలో ఉండే అత్యధిక మోతాదు రసాయనాల వలన ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన వారి శరీరంలోని అవయవాలు దెబ్బతిని తొందరగా చనిపోవడం జరుగుతుంది. ఎవరైనా వ్యక్తులు ఫెర్టిలైజర్ షాప్ కు వచ్చి గడ్డి మందు కావాలి అని అడిగినట్లయితే వారి వివరాలు తెలుసుకుని నమోదు చేసుకొవాలి.వారికి సంబంధించిన వారికి సదరు వ్యక్తి గడ్డి మందు కొనడానికి వచ్చాడాని, అది వారికి అవసరమా కాదా అనే సమాచారం తెలుసుకోవాలి.వారికి సంబంధించిన వివరాలు కూడా నమోదు చేసుకోవాలి. వచ్చిన వ్యక్తి వివరాలు తెలియ చేయనట్లయితే వారికి గడ్డి మందు ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు అని యజమానులకు సూచించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇలా చేస్తూ రికార్డ్స్ మెయింటైన్ చేసినట్లయితే విలువైన ప్రాణాలను కాపాడి వారి కుటుంబం రోడ్ పాలు కాకుండ వారికి మీరు పరోక్షంగా సాయం చేసిన వారు అవుతారని, తప్పనిసరిగా వివరాలు నమోదు చేస్తూ రికార్డ్స్ మైంటైన్ చేయాలని చట్టపరమైన చర్యలు తప్పవని తెలపడం జరిగింది. అవగాహన సదస్సు కోసం హాజరైన యజమానులు కూడా ఒక మనిషి ప్రాణం కాపాడడంలో తమ వంతు సహాయం తప్పకుండా అందిస్తామని పోలీసు వారికి సహకరిస్తామని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐ తో పాటు ఎస్ఐ ఉపేందర్, మహిళా ఎస్ఐ వినీత, ఫెర్టిలైజర్స్ షాప్ యజమానులు పాల్గొనడం జరిగింది.