Saturday, April 5, 2025

దివ్యాంగురాలుకి అండగా నిలిచిన నల్ల మనోహర్ రెడ్డి

తెలంగాణ/పెద్దపల్లి:పీసీడబ్ల్యు న్యూస్ ప్రతినిధి:

పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ 21వ వార్డుకి చెందిన నిరుపేద దివ్యాంగురాలు జకోడ భారతి కి వీల్ చేర్ అందించి మనోధైర్యము చెప్పిన తెరాస రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని హమి ఇచ్చారు.ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా దివ్యాంగులకు ఎవరికైనా ట్రై సైకిల్ కోసం తనని సంప్రదించవచ్చుననీ మరియు సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు మంత్రి కేటీఆర్ సహకారంతో దివ్యాంగులందరికి అందేలా చూస్తానని చెప్పారు.పేద ప్రజలకు సేవ చేయడం తనకెంతో సంతృప్తి ఇస్తుందని నియోజకవర్గంలోని పేదలు దివ్యాంగులు తనను సంప్రదించినట్లయితే భగవంతుడు తనకిచ్చిన శక్తి కొలది ఆసరాగా నిలిచి చేయూతనిస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, యువత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles