Saturday, March 7, 2026

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం- జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్

తెలంగాణ/పెద్దపల్లి:పిసిడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి:

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని జూలపల్లి జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్(టిడబ్ల్యుజెఎఫ్) రాష్ట్ర మహాసభల కరపత్రాలను విడుదల చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా జర్నలిస్టులు పనిచేస్తున్నారని అన్నారు.జర్నలిస్టుల ఐక్యత కొరకు హైదరాబాద్ లో ఈనెల 27న ఏర్పాటు చేసిన టి డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర మహాసభను విజయవంతం కొరకు జిల్లా కమిటీ కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిడబ్ల్యుజెఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పైడాకుల బిక్షపతి, ఫణి సుదర్శన్,రాజశేఖర్,కెసిఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు,టిడబ్ల్యుజెఎఫ్ ఉపాధ్యక్షులు బోయిని వినోద్,మారం తిరుపతి రెడ్డి,పబ్బాల శంకరయ్య,ఇరుకుల్ల వీరేశం,నూక రాందాసు,గోపి కృష్ణ లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles