తెలంగాణ/పెద్దపల్లి:పిసిడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ TWJF ద్వితీయ రాష్ట్రస్థాయి మహాసభలు ఈనెల 27వ తేదీన హైదరాబాదులో నిర్వహించే ద్వితీయ మహాసభల కరపత్రాలను మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీ డబ్ల్యూ జె ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయకుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పైడాకుల బిక్షపతి, ఫణి సుదర్శన్, ఉపాధ్యాక్షులు బోయిన వినోద్ మారం తిరుపతిరెడ్డి లతో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.