PCW News

Breaking
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే

ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఇంటర్మీడియట్ నోడల్ అధికారి.

తెలంగాణ/కామారెడ్డి-బీర్కూర్ పిసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి..

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం సందర్శించారు. కళాశాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డితో కలిసి ప్రతి తరగతి గదికి తిరుగుతూ అధ్యాపకులు చెప్పే పాఠ్యాంశాలను పరిశీలించి విద్యార్థులకు ప్రశ్నలు అడగి తెలుసుకున్నారు.సిబ్బందితో మీటింగ్ ఏర్పాటు చేసి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి మాట్లాడుతూ. కళాశాల వాతావరణం బాగుందని, విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా కృషి చేయాలని, అందరు కలిసి కళాశాలను అభివృద్ధి చేయాలని, ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పాఠ్యాంశాలను సిలబస్ ప్రకారం పూర్తి చేసుకుంటూ విద్యార్థుల్లో పరీక్షల భయం లేకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ మంచి ఉత్తీర్ణత శాతం వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మామిళ్ళ మోహన్ రెడ్డి, అధ్యాపకులు అక్కం విష్ణు, చంద్రశేఖర్, సతీష్, సౌమ్య, దేవి సింగ్ , శ్యాంసుందర్, కళాశాల జూనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు..