Saturday, March 7, 2026

డబుల్ బెడ్రూమ్ ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలి..

తెలంగాణ మహబూబాబాద్ పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: BSP మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ దార్ల శివరాజ్ జిల్లా లోని 18 మండలాల్లోని పెండింగ్ లో వున్న డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పూర్తి చేసి పార్టీ లకు అతీతంగా అర్హులైన పేదవారికి ఇవ్వాలి అని BSP మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ దార్ల శివరాజ్ అన్నారు. ఈ రోజు BSP ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ లో అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా శివరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ల పథకం ను ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంతవరకు లబ్ధిదారులుకు చేరడం లేదని ఆయన ఆరోపించారు…. వేలకోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసి కొన్ని చోట్ల చిన్న చిన్న కారణాలు చూపుతూ మరికొన్ని చోట్ల నిర్మాణం ఇంకా ప్రాధామిక దశ లోనే ఉన్నవని దీని వలన లబ్ధిదారులకు ఇంకా అవి చేరలేదని ఆయన అన్నారు… తక్షణమే డబుల్ బెడ్లు నిర్మాణం పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలనీ లేని యెడల BSP ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో BSP గార్ల మండల అధ్యక్షులు అజ్మీరావెంకన్న, మిర్యాల వీరన్న పాల్గొన్నారు.

Related Articles

Latest Articles