PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

మండల కేంద్రంపై నిర్లక్ష్యం తగదు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి రామచందర్ నాయక్..

తెలంగాణ/ మహబూబాబాద్ పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: డోర్నకల్ నియోజకవర్గంలో నర్సింహులపేట మండల కేంద్రాన్ని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్రనాయక్ విమర్శించారు. ఆదివారం మండల కేంద్రంలో మండల కమిటీ సమావేశం అనంతరం మండల కేంద్రంలో ముదిరాజ్ ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లికి 25వేల రూపాయలు విరాళం అందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ నర్సింహులపేట మండల కేంద్రాన్ని అభివృద్ధి కానీ ఇవ్వకుండా అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని మండల కేంద్రంలోని ప్రధాన దేవాలయం నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయాలను మరియు సంత అభివృద్ధి పనులను చేయడం లేదని వారు తెలిపారు. ప్రభుత్వ బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలని మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని గతంలో ఎన్నోసార్లు స్థానికులు చెప్పినా కూడా పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. మండలంలోని వ్యవసాయ గిడ్డంగులు వస్తే వాటిని కూడా నిర్మించకుండా నిర్లక్ష్యం చేశారని వారు తెలిపారు. మండల కేంద్రంలో అత్యవసరానికి అవసరమయ్యే వాహనం 108 వాహనం ఉండాలని అది మండల సెంటర్ గా ఉండాలని వారు సూచించారు. మండల కేంద్రంలోని ఎంతోమంది దళితులు భూమిలేదని దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని మండల కేంద్రంలోని ఎంతో మంది పేదవారు ఉన్నారని ప్రతి పేదవాడికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టి ఎస్ సి ఎస్ డైరెక్టర్ రజనీకాంత్ రెడ్డి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్ బీసీ సెల్ మండల అధ్యక్షులు గుండా గాని వెంకన్న గౌడ్ ఎస్ టి సెల్ మండల అధ్యక్షులు దస్రు నాయక్ మండల కార్యదర్శి రామకృష్ణ పెద్దనాగరం సర్పంచ్ సోమిరెడ్డి ఉప సర్పంచ్లు రాజేందర్ నాయక్ అనిల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ ఉప్పలయ్య మధుకర్ రెడ్డి ఐలయ్య శ్రీనివాసరావు మహబూబ్ ఖాన్ అనిల్ నాయక్ రమేష్ నాయక్ మల్లయ్య ఎంకన్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గుండాల బిక్షం రమేష్ శ్రీనివాస్ మధు యాకన్న అనిల్ యాదవ్ క్రాంతి కుమార్ రెడ్డి యాదగిరి, కాంగ్రెస్ గ్రామ కార్యకర్తలు బాబు నరేష్ సుమన్ యాదగిరి మల్లయ్య సైదులు తదితరులు పాల్గొన్నారు.