Wednesday, July 22, 2026

21 నా చలో రవీంద్ర భారతి..

తెలంగాణ/కరీంనగర్ జిల్లా పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి:  గంగాధర మండల కేంద్రంలో 21వ తేదీన ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ప్రతి గ్రామ గ్రామాన మత్స్య కార్మికులు జెండా ఆవిష్కరణ చేసుకొని నవంబర్ 21వ తేదీ నాడు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మత్స్య పరిశ్రమ సహకార సంఘం జిల్లా అధ్యక్షులు పోలు లక్ష్మణ్, జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు గుర్రాల మల్లేశం, జిల్లా యూత్ అధ్యక్షులు పండగ బాలు, హిమ్మత్ నగర్ సర్పంచ్ చంద్రయ్య, గంగాధర ముదిరాజ్ మిత్ర బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles