శభాష్ సబ్ ఇన్స్పెక్టర్ – దొంగల వేటలో పగడ్బందీ ప్రణాళికలు
మంథని పట్టణంలో ఈ మధ్యకాలంలో మళ్లీ దొంగల సంచారం అధికమవుతుండడంతో మంథని ఎస్సై వెంకటేశ్వర్లు పగడ్బందీ ప్రణాళికలతో దొంగల వేటలో పగడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తుండడం పట్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగిపోతున్నాయి. శుక్రవారం రాత్రి ఒక తాళం వేసి ఉన్న ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుండడం (రెక్కీ) నిర్వహించగా ఈ విషయాన్ని పసిగట్టిన పక్క ఇంటి వారు వెంటనే ఎస్సై కి తెలియజేయడంతో వెంటనే స్పందించి ఆ ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు. వివరాలు సేకరించిన వెంటనే పోలీస్ టీం లను అలర్ట్ చేసి మందాట ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తిని స్టేషన్ కు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తిని ఎవరు మీరు ఆగమని అడగాలా అతను వేగంగా బైక్ పై పారిపోయాడు. ఆ పారిపోయిన వ్యక్తికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి వెంటనే చేదించి పట్టణంలోని మందాడ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి మద్యం సేవించి ఉండడంతో అతన్ని ఎస్సై ఎన్ని రకాల ప్రశ్నించిన ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. గత ఫిబ్రవరి 17న ఇదే ఇంటిలో దొంగతనం జరిగింది. ఈ మధ్యకాలంలో పోలీస్ పెట్రోలింగ్ ప్రతిరోజు రాత్రి సమయంలో జరుగుతుండడంతో ప్రజల్లో పోలీసుల పట్ల భరోసా ఏర్పడింది.