డిసిపిని మర్యాదపూర్వకంగా కలిసిన సమతా ఫౌండేషన్ సభ్యులు
పెద్దపల్లి డీసీపీ చెన్నూరి రూపేష్ ని జిల్లా కేంద్రంలోని డిసిపి కార్యాలయంలో బుధవారం నాడు సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ తమ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు డిసిపి రూపేష్ కు భారత రాజ్యాంగ పుస్తకం, పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం దుర్గం నగేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక దళ్ సంస్థలో వారు పనిచేస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగ రక్షణకు, డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నామన్నారు. పే బ్యాక్ టు ద సొసైటీ స్ఫూర్తితో తమ వంతు సమాజానికి సమతా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు విద్యా, వైద్యం మొదలైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో సమత ఫౌండేషన్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సీనియర్ డాక్టర్ రాజు గారిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తద్వారా ఉచిత వైద్యం,మందులు పంపిణీ,రక్తదానం ప్లాస్మా దానం చేసినట్లు తెలిపా,దాంతో పాటు తమ ఫౌండేషన్ సభ్యులు కరోనా మృతులకు అంత్య క్రియలు చేశామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తున్నామన్నారు. అనాధ పిల్లలను చేరదీసి చదివిస్తున్నట్లు,మానసిక వికలాంగులను,పిచ్చి వాళ్లను చేరదీసి,ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉత్తరప్రదేశ్ చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి,పాల్వంచకు చెందిన బేగం అనే మహిళ మంచి వాళ్ళుగా మారారని గుర్తు చేశారు. దాంతోపాటు భవిష్యత్తులో మహనీయుల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులకు తమరు రావాలని ఆహ్వానించారు. అందుకు స్పందించిన డిసిపి రూపేష్ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా నిచ్చారు. ఈకార్యక్రమంలో సభ్యులు దుర్గం విశ్వనాథ్ ,మనోజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.