PCW News

Breaking
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే

గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం చేసిన మిత్రులు

తెలంగాణ / పెద్దపల్లి.సుల్తానాబాద్: పిసిడబ్ల్యు న్యూస్ ప్రతినిధి:

సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో నిరుపేద కుటుంబానికి చెందిన బండారి రమేష్ కిరాణా షాపులో గుమస్తా పని చేసుకుంటూ, ఇతర ఆదాయ నిమిత్తం రోజు ఉదయాన్నే పాలు, పెరుగు షాపులకు వేస్తూ తన జీవితాన్ని కొనసాగించేవాడు.గత 15 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగి దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ఇతనికి ఒక పాప ,బాబు ఉన్నారు.రమేష్ యొక్క పరిస్థితి తెలుసుకున్న చిన్ననాటి మిత్రులు 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి అతని కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు. రమేష్ యొక్క పరిస్థితిని పెద్దపెల్లి జిల్లా బిఎస్పి ఇన్చార్జ్ దాసరి ఉషకు స్థానిక నాయకులతో సమాచారం అందించగా, స్పందించిన ఆమె, వారి ద్వారా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. తన పరిస్థితి తెలుసుకొని సహాయం చేసిన మిత్రులకీ మరియు దాసరి ఉష కి రమేష్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో మిత్రబృందం సంపత్ కుమార్, ప్రదీప్, శ్రీధర్, సంతోష్, రామాదాస్, షమీర్,గోపి సంజీవ్ చారి, రాజ్ కుమార్, సమ్మయ్య ,బిఎస్పి నాయకులు,మాతంగి శంకర్, తోట వెంకటేష్ .ఆషాడపు రాములు, కొల్లూరి నర్సన్న, తదితరులు పాల్గొన్నారు.