దివ్యాంగుల హక్కుల వేదిక సమావేశం.
తెలంగాణ/కామారెడ్డి-బాన్సువాడ పిసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి..
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని గెస్ట్ హౌస్ లో దివ్యాంగులసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కుమ్మరి సాయిలు మాట్లాడుతూ సదరం సర్టిఫికెట్ మీద డాక్టర్ సంతకాలు లేకపోవడంతో పెన్షన్లు, బస్సు పాసులు ఇవ్వడం లేదని, కనుక వెంటనే డాక్టర్లు సంతకాలతో కూడిన సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు, అలాగే దివ్యాంగులకు డబుల్ బెడ్ రూములు, వికలాంగుల బంధు, వికలాంగులు సకలాంగులకు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చే నజరానా లక్ష రూపాయలు ఇవ్వడంలేదని తెలిపారు. వికలాంగుల కార్పొరేషన్ లోన్లు, ఈ సమస్యలను పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుమ్మరి సాయిలు, ఉపాధ్యక్షులు దారం రాములు, ప్రధాన కార్యదర్శి బాలాజీ, సలహాదారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.