రాజారాం పల్లి కుక్కల గూడూర్ బ్రిడ్జి నిర్మాణానికి 3 కోట్ల 50 లక్షల నిధులు మంజూరి..
తెలంగాణ పి.సి.డబ్ల్యూ.న్యూస్ ప్రతినిధి వెల్గటూర్, జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాం పల్లి కుక్కల గూడూర్ రహదారి బ్రిడ్జి నిర్మాణానికి మూడు కోట్ల యాభై లక్షల నిధులు మంజూరు చేసిన తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఎండపల్లి మండల టి.ఆర్.ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. కు మరియు కొప్పుల ఈశ్వర్ కు రాజారాంపల్లి పి.ఎస్.ఆర్ కూడలిలో సోమవారం వెల్గటూర్, ఎండపల్లి టి.ఆర్.ఎస్ మండల శాఖ అధ్యక్షులు సింహాచలం జగన్ రాజారాంపల్లి సర్పంచ్ గెల్లు శేఖర ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. సందర్భంగా జగన్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఎండపల్లి మండలానికి ప్రధమంగా మూడు కోట్ల 50 లక్షలు మంజూరు చేసినందుకు సీ.ఎం.కేసీ.ఆర్ కు మంత్రి ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ దారి ప్రతినిత్యం వాహనాలతో చాలా రద్దీగా ఉంటుంది ఈ బ్రిడ్జి నిర్మాణం వలన ఈ ప్రాంత ప్రజలకు చాలా ప్రయోజన చేకూరుతుందని తెలిపారు. గెల్లు శేఖర్ మాట్లాడుతూ గత మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు ఈ బ్రిడ్జి కొట్టుకపోవడం జరిగింది ప్రాంత ప్రజలు వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు ఈ బ్రిడ్జిని సందర్శించిన మంత్రి త్వరలోనే నిధులు మంజూరు చేసి ఇబ్బంది లేకుండా చూస్తానని ఇచ్చిన హామీ మేరకు మూడు మాసాల్లోనే మూడు కోట్ల 50 లక్షల నిధులు మంజూరి చేస్తానని మాటిచ్చారు. మాట నిలుపుకున్న ఘనుడని మంత్రి కొప్పుల ఈశ్వర్ అని ఆయన అన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఎలెటి కృష్ణారెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఎం.డి రియాజ్, టి.ఆర్.ఎస్ మాజీ అధ్యక్షులు ఎలెటి చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ సంఘ రాములు, బండ్ల గంగాధర్, రెడ్ల కృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిదం వెంకటేష్, మాజీ సర్పంచ్ గంగాధర్, మాజీ ఎంపీటీసీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.