PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన, ఏఎంసీ, సింగిల్ విండో అధ్యక్షులు..

తెలంగాణ పిసి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి, పాసిగామ, వెంకటాపూర్ ధర్మపురి మండలం తిమ్మాపూర్ సహకార సంఘం పరిధిలోని స్తంభంపల్లి పాసిగామ వెంకటాపూర్ గ్రామాల లో వరి కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ అధ్యక్షులు పత్తిపాక వెంకటేష్, తిమ్మాపూర్ సహకార సంఘం అధ్యక్షులు సాయిని సత్యనారాయణతో కలిసి ఆదివారం ప్రారంభించారు. పత్తిపాక వెంకటేష్ మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని రైతులకు ఆయన సూచించారు. నాయిని సత్యనారాయణ మాట్లాడుతూ మాచర వచ్చే విధంగా ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని రైతులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చల్లూరి రూపా రాణి, బొప్పా తిరుపతి రాందేని రామ ఎంపీటీసీ పోడేటి సతీష్ గౌడ్ ఉప సర్పంచ్ కొత్తూరి భూమయ్య సంఘ డైరెక్టర్లు రాందేని కోటయ్య యాగండ్ల మల్లేశం కంటెం తిరుపతి నాయకులు చెల్లూరి రామచంద్ర గౌడ్ సింగిల్ విండో అధికారులు పాలకవర్గ సభ్యులు మహిళలు రైతులు తదితరులు పాల్గొన్నారు.