Thursday, November 26, 2026

కమలాపూర్‌లో బాల కార్మికులతో వెట్టి చాకిరి?

కమలాపూర్, నవంబర్ 26 (పీసీడబ్ల్యూ న్యూస్): హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని శివ సిమెంట్ బ్రిక్స్ కేంద్రంలో బాల కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీ నుంచి తీసుకొచ్చి రోజుకు రూ.200 మాత్రమే చెల్లిస్తూ 24 గంటలు పని చేయిస్తున్నారని తల్లిదండ్రులు, కార్మికులు తెలిపారు. కనీస వసతులు లేక వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పెంచమని అడిగితే కర్రలు, బెల్టులతో కొట్టి హింసిస్తున్నారని ఆరోపించారు. యజమానిపై ఫిర్యాదు నమోదైనట్లు సమాచారం. జిల్లా అధికారులు, తహసీల్దార్, రెవెన్యూ, పోలీస్, కార్మిక, ఐసీడీఎస్ శాఖలు రంగంలోకి దిగాయి. కార్మికులను ఆర్డీవో ఎదుట హాజరుపరిచి కుటుంబాలకు అప్పగించే చర్యలు చేపట్టినట్లు తెలిసింది. యజమానిపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Latest Articles