Thursday, November 26, 2026

పరకాలలో రూ.45,720 విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టివేత

పరకాల పట్టణంలోని జయ టాకీస్ రోడ్డులో గుట్కా విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. బ్లూ కలర్ స్కూటీపై 90 గుట్కా ప్యాకెట్లను పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు విక్రయించేందుకు తరలిస్తున్న జీల శేఖర్‌ను పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ రూ.45,720గా పోలీసులు తెలిపారు. నిందితుడు కరీంనగర్ జిల్లా ధర్మారం మండలానికి చెందినవాడిగా గుర్తించి కేసు నమోదు చేశారు.

Related Articles

Latest Articles